ETV Bharat / snippets

'ఉద్యోగుల పేస్కేల్ తగ్గించడం - శిక్షాత్మక చర్యలకు సమానం' - సుప్రీం కోర్ట్​

Supreme Court
Supreme Court (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 9, 2024, 6:59 AM IST

Employees Pay Scale Issue : ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేలును తగ్గించడం, వారికి చెల్లించిన మొత్తాలను తిరిగి వసూలు చేయడం శిక్షాత్మక చర్యలకు సమానమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి చర్యలతో తీవ్ర ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయని అభిప్రాయపడింది. ఓ విశ్రాంత ఉద్యోగి వేతన స్కేలును తగ్గిస్తూ 2009అక్టోబరులో బిహార్‌ సర్కార్​ ఉత్తర్వు జారీ చేసింది. అప్పటిదాకా ఆయనకు అధికంగా దక్కిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. ఆ ఉద్యోగికి పొరపాటున అధిక స్కేలు దక్కినట్లు తెలిపింది. సంబంధిత ఉత్తర్వును పట్నా హైకోర్టు 2012లో సమర్థించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్ట్​లో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ సందీప్‌ మెహతా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌ల ధర్మాసనం బిహార్‌ ప్రభుత్వ ఉత్తర్వును కొట్టివేసింది. ఆ ఉత్తర్వు జారీఅయ్యే నాటికే ఉద్యోగి రిటైర్ అయ్యారని కనుక, అంతటి సుదీర్ఘకాలావధి తర్వాత ఆయన నుంచి డబ్బు తిరిగి వసూలు చేయడం సరికాదని పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.