ETV Bharat / snippets

హల్వా వండిన నిర్మలమ్మ- బడ్జెట్​లో​ నిమగ్నమైన అధికారులు

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 10:54 PM IST

Budget Halwa Ceremony 2024
Budget Halwa Ceremony 2024 (ANI)

Budget Halwa Ceremony 2024 : 2024-25కు సంబంధించి పూర్తి బడ్జెట్‌ రూపకల్పన తుదిదశను సూచించేలా కేంద్రం హల్వా వేడుకను నిర్వహించింది. నార్త్‌బ్లాక్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, కార్యదర్శులతో పాటు బడ్జెట్‌ తయారీ, సంకలన ప్రక్రియల్లో పాల్గొన్న అధికారులు వేడుక జరుపుకొన్నారు. బడ్జెట్ తయారీ 'లాక్-ఇన్' ప్రక్రియ ప్రారంభానికి ముందు ఏటా హల్వా వేడుకను నిర్వహించడం ఆనవాయితీ. ఓ కడాయిలో వండిన హల్వాను ఆర్థిక మంత్రి బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న అధికారులకు అందిస్తారు. హల్వా వేడుక జరిగిన తర్వాత బడ్జెట్‌ తయారీలో పాల్గొన్న అధికారులు, ఎవర్నీ ఆర్థిక మంత్రిత్వ శాఖ కాంపౌండ్‌ను విడిచి బయటకు వెళ్లేందుకు అనుమతించరు. ఆ బృందమంతా బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పించిన తర్వాతే బయటకు వెళ్లేందుకు అనుమతిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.