ETV Bharat / snippets

సిక్కింలో భూకంపం - రిక్టర్ స్కేల్​పై 4.5 తీవ్రత నమోదు

Sikkim  earthquake
earthquake hits Sikkim (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 9, 2024, 9:04 AM IST

Earthquake Hits Sikkim : శుక్రవారం తెల్లవారుజామున సిక్కింలో భూకంపం వచ్చింది. దీనితో ప్రజలు భయంతో ఆరుబయటకు పరుగులు తీశారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

రిక్టర్ స్కేల్​పై 4.5 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ సిక్కింలోని సోరెంగ్ పట్టణానికి 2 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వారు తెలిపారు. శుక్రవారం ఉదయం 6.57 గంటలకు 10 కి.మీ లోతులో ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఇండియన్ సెస్మిక్ జోనింగ్ మ్యాప్​లో సిక్కిం హై-రిస్క్ సెస్మిక్ జోన్​-VIలో ఉంది.

2011 సెప్టెంబర్​ 18న సిక్కింలో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పుడు దాదాపు 100 మందికి పైగా మరణించారు. తీవ్రమైన ఆస్తి నష్టం కూడా జరిగింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.