విశాఖలో యువశక్తి సదస్సు - 10 వేల మందికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యం
🎬 Watch Now: Feature Video
Yuvashakhi Sadassu In Visakha : విశాఖపట్నంలో పరిశ్రమలు, సంస్థల స్థాపనకు ఉన్న మంచి అవకాశాలు, లక్షల మందికి ఉద్యోగ - ఉపాధి అవకాశాలు చూపించే విజన్ డాక్యుమెంట్‌ని పల్సస్ సీఈవో డాక్టర్ జి. శ్రీనుబాబు ఆవిష్కరించారు. విశాఖపట్నం, సిరిపురం జంక్షన్‌లోని గురజాడ కళాక్షేత్రంలో యువశక్తి సదస్సు నిర్వహిస్తామని వెల్లడించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఇంజనీరింగ్, వివిధ ఉన్నత విద్య కోర్సులు పూర్తి చేసుకున్న 10 వేల మంది విద్యార్థులకు యువశక్తి ద్వారా లబ్ది చేకూర్చడమే తమ లక్ష్యం అన్నారు.
సంవత్సరానికి 5 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉత్తీర్ణుల అవుతున్నప్పటికీ, ఉద్యోగాల కోసం 80 శాతానికి పైగా సొంత రాష్ట్రాన్ని ఎందుకు విడిచిపెడుతున్నారు ? అనేది ఆలోచించాలని శీనుబాబు కోరారు. 12 సంవత్సరాలలో 50 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉద్యోగాల కోసం ఆంధ్రప్రదేశ్‌ని విడిచిపెట్టి వెళ్లడం ఆందోళనకరమైన అంశమని చెప్పారు. మేథోవలసలు నివారించడానికి స్థానికంగా ఉపాధి కల్పించడమే తక్షణ ఉపాయమని, అందుకు ఈ యువశక్తి సదస్సు తోడ్పడుతుందని శ్రీనుబాబు వివరించారు.