ఆదినారాయణరెడ్డికి టికెట్ ఇచ్చినా పోటీ సాధారణమే : ఎమ్మెల్యే రాచమల్లు - bjp leader adinarayana reddy
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 3, 2024, 12:40 PM IST
YSRCP MLA Rachamallu Siva Prasad Reddy Comments: బీజేపీ నేత ఆదినారాయణరెడ్డిపై వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదు రెడ్డి కీలక వాఖ్యలు చేశారు. బీజేపీ-టీడీపీ పొత్తులో భాగంగా ఆదినారాయణరెడ్డికి ప్రొద్దుటూరు టికెట్ ఇస్తే పోటీ సాధారణంగానే ఉంటుందన్నారు. ఆదినారాయణరెడ్డి నియోజకవర్గమైన జమ్మలమడుగులో గత ఎన్నికల్లో 50 వేల ఓట్లు మెజారిటీతో వైసీపీ గెలిచిందని ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు. దీంతో ఆదినారాయణరెడ్డి ప్రొద్దుటూరు నుంచి ఎన్నికల బరిలో నిలిచినా పోటీ సాధారణంగానే ఉంటుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల బరిలో ఎవరున్నా కుస్తీ పట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాచమల్లు తెలిపారు.
అదే విధంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ నిర్వీర్యం అయిపోయిందని, వారిలో వారే కొట్టుకుంటున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ-బీజేపీ పొత్తు కుదిరితే ఈ సీటును ఆదినారాయణరెడ్డికి ఇచ్చేందుకు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాను మాత్రమే అనడం లేదని నియోజకవర్గంలోని ప్రజలంతా ఇదే చర్చించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ ఎవరు పోటీ చేసినా మట్టి కరిపిస్తామని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పారు.