మాచర్లలో మరో దారుణం వెలుగులోకి- యువకుడిపైకి వాహనం ఎక్కించిన పిన్నెల్లి అనుచరులు - MLA PINNELLI ATTACKS - MLA PINNELLI ATTACKS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 23, 2024, 7:34 PM IST
Pinnelli Followers Anarchies in Macherla: ఈనెల 13 న పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకం మరొకటి వెలుగుచూసింది. మాచర్ల పట్టణంలో పీడబ్ల్యూపీ కాలనీలో టీడీపీ నేత కేశవరెడ్డి మీద పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి వాహనాల్లో వచ్చి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ నేతలకు చెందిన వాహనం భవానీ ప్రసాద్ అనే యువకుడిపైకి ఎక్కించారు. ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అకారణంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు తనను కొట్టి, వాహనం ఎక్కించారని ఆవేదన వ్యక్తం చేశాడు. యువకుడి పరిస్థితి చూసి అతడి తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఎమ్మెల్యే, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఈ ఐదేళ్లలో అడ్డూ అదుపూ లేకుండా అరాచకాలు, అకృత్యాలకు పాల్పడి నియోజకవర్గ ప్రజలను పీల్చిపిప్పి చేశారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పోలింగ్ రోజున పిన్నెల్లి సోదరుడు, వారి అనుచరులు చేసిన ఆకృత్యాల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తారు.