ఎన్నికల నియమావళికి నీళ్లొదిలిన వైఎస్సార్సీపీ నేతలు - YSRCP Violated Election Code - YSRCP VIOLATED ELECTION CODE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 23, 2024, 2:03 PM IST
YSRCP Leaders Violated Election Code Rules : ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై ఈసీ కొరడా ఝుళిపిస్తున్నా వైఎస్సార్సీపీ నేతలకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీవారైనా ముందస్తుగా నియోజకవర్గ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైఎస్సార్సీపీ సమన్వయకర్త సతీమణి కల్పనారెడ్డి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఇంటింటి ప్రచారం (Campaigns) నిర్వహిస్తున్నారు.
EC Removed Employees in AP : కొంగలవీడు గ్రామానికి చెందిన రేషన్ డీలర్ బొంత రాజగోపాల్ రెడ్డి వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనాల పొందుతూ వైఎస్సార్సీపీ (YSRCP) సేవలో తరిస్తున్నారని స్థానికులు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. శ్రీకాకుళం జిల్లా మందస మండల కేంద్రానికి చెందిన మరో రేషన్ డీలర్ చెరుకుపల్లి లక్ష్మన్ వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించారు. వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు (TDP Leaders) ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.