గొర్లె కిరణ్‌ను మార్చండి - లేకపోతే రాజీనామాలు చేస్తాం: ఎచ్చెర్ల వైఎస్సార్సీపీ నేతలు - Protest To MLA Gorle Kiran Kumar - PROTEST TO MLA GORLE KIRAN KUMAR
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-04-2024/640-480-21165848-thumbnail-16x9-ysrcp-leaders-protest.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 7, 2024, 9:26 AM IST
YSRCP Leaders Protest : ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గడిచిన మూడేళ్లుగా ఆ పార్టీ నేతల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆ పార్టీ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ కేటాయించడంతో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నాయకులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చకపోతే నాలుగు మండలాల నుంచి మూకుమ్మడి రాజీనామాలు తప్పవని హెచ్చరించారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం పెద్దలింగాల వలసలో వైఎస్సార్సీపీ అసమ్మతి నాయకులు సమావేశమయ్యారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ (MLA Gorle Kiran Kumar)ని మార్చాలని ఆ పార్టీ అసమ్మతి నాయకులు డిమాండ్ చేశారు. ఆ పార్టీ సీనియర్ నాయకుడు లుకలాపు అప్పలనాయుడు మాట్లాడుతూ "మేము వైసీపీకు వ్యతిరేకం కాదు, ఎమ్మెల్యే కిరణ్ కుమార్‌కు వ్యతిరేకం. పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేసినా మాకు చాలా అన్యాయం జరిగింది. ఎచ్చెర్ల నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం 2019లో కష్టపడి పని చేశాం. ఆయన గెలిచిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టారు. నియోజకవర్గంలో పార్టీ వేరే ఎవరికైనా ఎమ్మెల్యే టికెట్ ప్రకటిస్తే కష్టపడి పని చేస్తాం. లేని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిని బరిలోకి దించుతాం. త్వరలోనే నాలుగు మండలాల నాయకులతో సమావేశం నిర్వహించి అభ్యర్థి పేరు ఖరారు చేస్తాం. ఎమ్మెల్యే అభ్యర్థిగా కిరణ్‌ను కొనసాగిస్తే మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం" అని ఆయన స్పష్టం చేశారు. ఎంపీటీసీలు సభ్యులు రౌతు నారాయణరావు, సురేశ్, మాజీ సర్పంచులు సత్యం, నాగరాజు, గొల్లారావు, రామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.