'వైఎస్సార్సీపీ నేతలు దౌర్జన్యంగా నా పొలంలో సాగు చేస్తున్నారు' - YSRCP Leaders Encroachment
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 24, 2024, 6:50 PM IST
YSRCP Leaders Land Grabbing Issue in Satya Sai District : వైఎస్సార్సీపీ వర్గీయులు దౌర్జన్యంగా తమ భూమిలో నాట్లు వేస్తున్నారంటూ శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం గేమ్యనాయక్ తండాకు చెందిన శ్రీనివాసులు నాయక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాసులు తండ్రి తండాలో 50 సెంట్ల పొలాన్ని కొనుగోలు చేశారు. తండ్రి తర్వాత ఆ భూమికి శ్రీనివాసులుకు చెందింది. రెవెన్యూ రికార్డులు, ఆన్లైన్లోనూ ఈ భూమి అతడి పేరిటే ఉంది.
వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన నేతలు శ్రీనివాసులు నాయక్ కుటుంబ సభ్యులపై దాడి చేసి భూమిలోకి రానీయకుండా అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశంతో తనకల్లు తహసీల్దారు ఆ పొలం శ్రీనివాసులుదేనంటూ గతేడాదే స్పష్టం చేశారు. తాజాగా నలుగురు స్థానిక వైఎస్సార్సీపీ నేతలు తమ పొలంలో వరి పంట సాగు చేస్తున్నారని, అడ్డుకునేందుకు వెళ్లిన తమపై దాడి చేసి గాయపరిచారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ పొలంలోకి దౌర్జన్యంగా ప్రవేశించిన వారిపై కేసు నమోదు చేసినా వారి తీరు మారలేదంటూ శ్రీనివాసులు నాయక్ వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నారు.