బస్సు ఎక్కండి-డబ్బులు తీసుకోండి! సీఎం సభకు వచ్చే జనాలకు డబ్బులు పంచుతున్న వీడియో వైరల్ - సిద్ధం సభకు ప్రజలకు నగదు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 3, 2024, 9:30 PM IST

YSRCP Leaders Give Money: ఏలూరులో నిర్వహిస్తున్న సీఎం జగన్ సిద్ధం సభకు జనాన్ని తరలించేందుకు అధికార పార్టీ నేతలు నానా తంటాలు పడుతున్నారు. కొంత మంది అధికార పార్టీ నాయకులకు జనసమీకరణ బాధ్యత పెద్ద తలనొప్పిగా మారింది. ఆహారం-బస్సులు ఏర్పాటు చేస్తామన్నా జనాలు రాకపోవడంతో డబ్బులు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓట్లు వేసేందుకు డబ్బులు కాదు, సభకు వచ్చేందుకే ఈ డబ్బులు అంటూ స్థానిక నేతలు నోట్లు లెక్కపెట్టి మరీ పంచుతున్నారు. కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలో జనాన్ని బస్సుల్లో ఎక్కించి, అందులోనే నగదు పంచుతున్నా దృశ్యాలు ఇప్పుడు వైరల్​గా మారాయి. మహిళలు, పురుషులు, వృద్ధులకు నోట్లు పంపిణీ చేస్తున్న వీడియో హల్ చల్ చేస్తోంది. 

రానున్న ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ ఎన్నికలకు సమయత్తమవుతోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ అధినేత జగన్ 'సిద్ధం' పేరుతో బహిరంగ సభను నిర్వహిస్తోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సభలను నిర్వహించాలని జగన్ భావించడంత, వైసీపీ శ్రేణులు కూడా జనాల్ని తీసుకురావడం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో జనాలు జగన్ సభకు హజరు అయ్యేందుకు ఆసక్తి చూపకపోవడంతో డబ్బులు పంచీ జనాల్ని తీసుకొస్తున్నారనే వాదన వ్యక్తమవుతోంది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.