టీడీపీ ప్రచారానికి వెళ్లారని వైసీపీ కక్ష - జనసైనికుడి గుడిసె కూల్చివేత - YSRCP Destructed Janasainik House

🎬 Watch Now: Feature Video

thumbnail

YSRCP Leaders Destructed Janasainik House: టీడీపీ ప్రచారంలో పాల్గొన్న వారిపై అధికార వైసీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో టీడీపీ ప్రచారంలో పాల్గొన్నందుకు ఓ జనసైనికుడి గుడిసెను కూల్చేశారు. కోవూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి ఈ నెల 27న విడవలూరు మండలం రామచంద్రాపురం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో స్థానిక జనసేన కార్యకర్త క్రిష్ణ, అనిత దంపతులు పాల్గొన్నారు. 

దీంతో కక్షసాధింపు చర్యలకు దిగిన వైకాపా నాయకులు, గతంలో ఇంటి నిర్మాణానికి తాము ఇచ్చిన నాలుగు స్తంభాలూ ఇచ్చేయాలంటూ గద్దించారు. ఆపై ఇంటిని కూల్చేసి నాలుగు స్తంభాలనూ పట్టుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న జనసేన నేతలు బాధితులను పరామర్శించి వైసీపీ తీరుపై ఆగ్రహం చేశారు. బాధితుడికి అన్ని విధాలా అండగా ఉంటామని ప్రకటించారు. మత్స్యకార గ్రామమైన రామచంద్రాపురంలో వైసీపీ నాయకుల తీరు వల్ల ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉందని జనసైనికులు ఆందోళన వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.