కానిస్టేబుల్‌పై వైఎస్సార్సీపీ నేతల దాడి- ఆలస్యంగా వెలుగు చూసిన మరో దారుణం - YSRCP Leaders Attack on Police - YSRCP LEADERS ATTACK ON POLICE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 24, 2024, 7:28 AM IST
YSRCP Leaders Attack on Police in Nellore District : గుర్తింపు కార్డును సాకుగా చూపి ఎన్నికల విధుల్లో ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్‌పై వైఎస్సార్సీపీ నాయకులు దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం రామస్వామిపల్లిలో మే 13న పోలింగ్‌లో ఆ సంఘటన జరిగింది. రామస్వామిపల్లి గ్రామంలోని 111, 112 పోలింగ్ కేంద్రాల ఆవరణలోకి స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పదే పదే వస్తూ ఓటర్లును ప్రభావితం చేసేందుకు యత్నించారు. దానిపై అక్కడ విధులు నిర్వహిస్తున్న తిరుమల వాసు అనే ఏఆర్ కానిస్టేబుల్ అభ్యంతరం చెప్పారు. అక్కడ ఉన్న వైఎస్సార్సీపీ నాయకులను బయటకు పంపిందుకు యత్నించారు. వారు మళ్లీ తిరిగి రావడంతో వీడియో చిత్రీకరించారు.
దీంతో ఆగ్రహించిన వైఎస్సార్సీపీ శ్రేణులు నకిలీ పోలీసు విధులు నిర్వహిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశారు. అప్పటికే మద్యం సేవించిన వైఎస్సార్సీపీ నేతలు కానిస్టేబుల్‌పై, వీడియోలు చిత్రీకరిస్తున్న విలేకరిపై దాడి చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోలపై జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ స్పందించారు. కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ కు చెందిన వ్యక్తేనని ధ్రువీకరించారు.