నిలిచిపోయిన హాస్టల్ పనులు - పశువుల షెడ్డుగా మార్చిన వైఎస్సార్సీపీ నాయకుడు - BC Boys Hostel into Cattle Shed - BC BOYS HOSTEL INTO CATTLE SHED
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 23, 2024, 1:25 PM IST
YSRCP Leader Converted BC Boys Hostel into Cattle Shed in Satyasai District : బీసీ బాలుర వసతి గృహం కోసం నిర్మించిన భవనాన్ని పశువుల షెడ్డుగా ఓ వైఎస్సార్సీపీ నాయకుడు మార్చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలో బీసీ బాలుర వసతి భవనాన్ని గత ప్రభుత్వ హయాంలో నిర్మించారు. కాంట్రాక్టర్కు బిల్లులు మంజూరు కాకపోవడంతో చివరి దశలో పనులు నిలిచిపోయాయి. దీంతో ఆ భవనానికి పెయింటింగ్, తలుపులు ఏర్పాటు చేయకపోవడంతో వసతి గృహం పిల్లలకు అందుబాటులోకి రాలేదు.
ఈ నేపథ్యంలోనే నల్లచెరువు మండలానికి చెందిన ఓ వైఎస్సార్సీపీ నాయకుడు వసతి గృహాన్ని పశువుల షెడ్డుగా మార్చేశారు. స్థానికులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఈ విషయాన్ని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో కలిసి వసతి భవనాన్ని పరిశీలించారు. ప్రభుత్వ భవనాన్ని స్వాధీనం చేసుకుని, వసతి గృహాన్ని పశువుల పాకగా మార్చిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.