మహిళపై దాడికి తెగబడిన వైఎస్సార్సీపీ నేత - సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ - దాడికి తెగబడిన వైఎస్సార్సీపీ నేత
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-01-2024/640-480-20601452-thumbnail-16x9-ysrcp-leader-attack-on-woman.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 26, 2024, 10:46 PM IST
YSRCP Leader Attack on Woman: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దాష్టీకాలు పెచ్చు మీరుతున్నాయి. వారు ఎప్పుడూ ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదు. భూ కబ్జాలు, వనరుల దోపిడీ మాత్రమే కాకుండా నీచపు పనులకు కూడా తెగబడుతున్నారు. అనంతపురం జిల్లాలో తన కోర్కె తీర్చలేదనే నెపతో మహిళపై దాడికి తెగబడ్డాడు ఓ వైఎస్సార్సీపీ నేత. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన సచివాలయ కన్వీనర్ నటరాజ్ అనే వ్యక్తి, ఓ మహిళపై దాడికి పాల్పడ్డాడు. మహిళ అని చూడకుండా విచక్షణారహితంగా జుట్టు పట్టుకుని లాగి తీవ్రంగా దాడి చేశాడు. అతను దాడి చేస్తుండగా ఆ మహిళ ప్రతిఘటించింది. ఆమె ప్రతిఘటనతో మరింత రెచ్చిపోయిన అతను, మహిళను కిందపడేసి మరి దారుణంగా దాడి చేశాడు. ప్రస్తుతం ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి. సదరు మహిళపై కన్నేసిన నటరాజ్, ఆమె అంగీకరించకపోవడంతో నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడి అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా, వారిపైన కూడా నటరాజ్ దాడికి తెగించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.