ఇంటి స్థలం కోసం వినతిపత్రం సమర్పించినా పట్టించుకోలేదు- మోహిత్ రెడ్డికి నిరసన సెగ - YSRCP Chevireddy campaing - YSRCP CHEVIREDDY CAMPAING
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 17, 2024, 6:42 PM IST
YSRCP Chevireddy Mohith Reddy campaing in Tirupati district : ఇంటింటి ప్రచారానికి వెళ్లిన చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. తిరుపతి గ్రామీణ మండలం బ్రాహ్మణపట్టులో ప్రచారం చేస్తూ ఓ ఇంటి వద్దకు వెళ్లిన మోహిత్‌రెడ్డి కరపత్రమిచ్చి ఓటు వేయాలని కోరారు. మూడేళ్లుగా ఇంటి స్థలం కోసం వినతిపత్రం సమర్పించినా పట్టించుకోలేదని ఈ సందర్భంగా మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే వర్గానికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని మండిపడ్డారు. ఓ మహిళ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మోహిత్ రెడ్డి ఇబ్బంది పడ్డారు.
Protest to YSRCP Chevireddy Mohith Reddy : ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీల వారు ప్రచారాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పలువురు వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి నిరసన సెగ తగులుతోంది. ఐదేళ్ల పాలనలో ఏం చేశారని ప్రజలు వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్నారు. సమాధానం చెప్పలేని నాయకులు మొహం చాటేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.