వివేకా హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్ రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమం - Viveka Watchman Ranganna - VIVEKA WATCHMAN RANGANNA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 3, 2024, 5:30 PM IST
YS Viveka Murder Case Watchman Ranganna Joined in Kadapa Hospital : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత కొంతకాలంగా రంగన్న శ్వాస కోస వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. రంగన్నను కుటుంబ సభ్యులు పులివెందుల ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. రంగన్న పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంత కాలంగా రంగన్న ఆస్తమాతో బాధపడుతున్నాట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వివేక హత్య కేసులో రంగన్న ప్రత్యక్ష సాక్షిగా ఉండటం గమనార్హం.
వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు నలుగురు నిందితులను చూశానని సీబీఐకి రంగన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ విషయాన్ని జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు సీఆర్పీసీ సెక్షన్ 164 కింద రంగన్న వాంగ్మూలం కూడా ఇచ్చారు. రంగన్నను కాపాడుకోవడానికి సీబీఐ ప్రత్యేకంగా వన్ ప్లస్ వన్ సెక్యూరిటీని కూడా కల్పించారు.