పులివెందులలో కొనసాగుతున్న వైఎస్ సునీత ప్రచారం- షర్మిలకు ఓటు వేయాలని అభ్యర్థన - Ys Sunitha Election Campaign - YS SUNITHA ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-05-2024/640-480-21394715-thumbnail-16x9-ys-sunitha-election-campaig--in-kadapa-district.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 5, 2024, 9:11 PM IST
YS Sunitha Election Campaign in kadapa District : వైఎస్సార్సీపీ పాలనలో దోపిడి రాజ్యం నడుస్తోందని వైయస్ సునీత ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన అన్యాయం, అక్రమలే రాజ్యామేలు తున్నాయని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ జిల్లా పెద్దముడియం మండలంలోని పెద్దపసుపుల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కడప పార్లమెంట్ అభ్యర్థి వైయస్ షర్మిలకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, మనందరికి సుపరిచితుడు అయిన వివేకానంద రెడ్డిని ఎంత దారుణంగా చంపారో అందరికి తెలుసన్నారు. నాన్నని దారుణంగా హత్యచేసి ఐదు సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికి న్యాయం జరగలేదని వాపోయారు.
కడప ఎంపీగా పోటీ చేస్తున్న అవినాష్ అసలు మీకు అందుబాటులో ఉన్నాడా? అని ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి హాత్యకేసులో నిందితుడిగా ఉన్న అలాంటి వారిని ఓట్లు వేసి గెలిపిస్తే ఇక ప్రజాస్వామ్యం ఉంటుందా? అని మండిపడ్డారు. కాబట్టి హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించాలని ఓటర్లకు సునీత విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో చేస్తున్న సమయంలో జమ్మలమడుగు ఇండిపెండెంట్ అభ్యర్థి అల్లె ప్రభావతి కారులో వెళ్తుండగా సునీత ఆమెతో మాట్లాడారు. అక్కడి నుంచి రామిరెడ్డి పల్లె మోటు, తేరు రోడ్డు, పాత బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్, శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వరకు వైయస్ సునీత రోడ్ షో నిర్వహించారు.