సీఎం జగన్‌పై గలకరాయి దాడి కేసు - విచారణ ఈనెల 27కి వాయిదా - STONE attack on CASE - STONE ATTACK ON CASE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 3:23 PM IST

YS Jagan Stone Pelting Case Hearing: సీఎం జగన్​పై రాయి దాడి కేసులో నిందితుడిగా ఉన్న సతీష్ బెయిల్ పిటిషన్​పై విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్ పిటిషన్​పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తులో ఉందని, నిందితుని ఐడెంటిఫికేషన్ పరేడ్ చేయాల్సి ఉందని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ తరుణంలో బెయిల్ మంజూరు చేయవద్దని న్యాయస్థానాన్ని కోరారు. కౌంటర్​పై వాదనలు వినిపించేందుకు సతీష్ తరపు న్యాయవాది సలీం సమయం కోరారు. తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.

Stone Attack on CM Jagan: 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో భాగంగా విజయవాడ డాబాకొట్ల సెంటర్ వద్ద నిర్వహించిన రోడ్ షోలో సీఎం జగన్​ మోహన్ రెడ్డిపై రాయి దాడి జరిగింది. ఈ దాడిలో జగన్‌కు స్వల్పగాయమైంది. జగన్‌ బస్సు యాత్ర విజయవాడ అజిత్‌ సింగ్‌ నగర్‌లోని గంగారం గుడి సెంటర్‌ వద్దకు చేరుకున్నాక, ఓ వైపు నుంచి రాయి వచ్చి జగన్​ మోహన్ రెడ్డికి తగిలింది. ఆ తరువాత పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్​కు రాయి తాకింది. ఈ ఘటనలో జగన్‌ మోహన్ రెడ్డి ఎడమ కనురెప్పపై భాగంలో స్వల్ప గాయమైంది. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. వైద్యులు ఆయనకు బస్సులోనే ప్రాథమిక చికిత్స చేశారు. ‌దీనిపై అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, స్థానికుడు సతీష్​ను అరెస్ట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.