జగన్‌పై రాయి దాడి కేసు - నిందితుడి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా - YS Jagan Stone Pelting Case

🎬 Watch Now: Feature Video

thumbnail

YS Jagan Stone Pelting Case Hearing: సీఎం జగన్​పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్​పై విజయవాడ కోర్టు విచారణ జరిపింది. వాదనలు వినిపించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానాన్ని సమయం కోరారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యర్ధనను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చేనెల 23వ తేదీకి వాయిదా వేసింది. 

Stone Attack on CM Jagan: కాగా మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో భాగంగా విజయవాడ డాబాకొట్ల సెంటర్ వద్ద నిర్వహించిన రోడ్ షోలో సీఎం జగన్​పై రాయి దాడి జరిగింది. ఈ దాడిలో సీఎం జగన్‌కు స్వల్పగాయమైంది. జగన్‌ బస్సు యాత్ర విజయవాడ అజిత్‌ సింగ్‌ నగర్‌లోని గంగారం గుడి సెంటర్‌ వద్దకు చేరుకున్నాక, ఓ వైపు నుంచి రాయి వచ్చి జగన్​కు తగిలింది. ఆ తరువాత పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్​కు రాయి తాకింది. ఈ ఘటనలో జగన్‌ మోహన్ రెడ్డి ఎడమ కనురెప్పపై భాగంలో స్వల్ప గాయమైంది. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తంకాగా, వైద్యులు ఆయనకు బస్సులోనే ప్రాథమిక చికిత్స చేశారు. ‌దీనిపై అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, స్థానికుడు సతీష్​ను అరెస్ట్ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.