ఒక చేత్తో బీర్ బాటిల్, మరో చేత్తో సిగరెట్ పట్టుకొని యువతి హల్చల్ - వీడియో వైరల్ - Young Woman Beer Bottle Video Viral - YOUNG WOMAN BEER BOTTLE VIDEO VIRAL
🎬 Watch Now: Feature Video
Published : May 24, 2024, 7:58 PM IST
Young Woman Beer Bottle Video Viral : పట్టపగలు ఓ యువతి రోడ్డుపై ఓ చేత్తో బీర్ బాటిల్, మరో చేత్తో సిగరెట్ పట్టుకుని హల్ చల్ చేసింది. ఇది చూసి అక్కడకు వాకింగ్‌కు వచ్చిన వారు అవాక్కు అయ్యారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతుల్లగూడ సమీపంలో గురువారం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఉదయం ఆరు గంటలకు నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతుల్ల గూడ సమీపంలో యువతీ యువకుడు బీర్లు తాగుతూ హల్చల్ చేశారు. అక్కడికి వాకింగ్‌కు వెళ్తున్న వారు నిలదీయడంతో వారితో వాగ్వాదానికి దిగారు. బూతులు తిడుతూ ఆ యువతీ యువకుడు ఒక చేత్తో బీరు బాటిల్, మరో చేతిలో సిగరెట్ పట్టుకొని కారులో పాటలు పెట్టి నానా హంగామా చేశారు. ఆ తంతంగాన్ని మొత్తాన్ని వీడియో తీస్తున్న వ్యక్తిని యువతి అసత్య పదజాలంతో తిడుతూ దాడి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.