పోలీసులు వేధిస్తున్నారంటూ యోగా మాస్టర్​ ఆత్మాహత్యాయత్నం - Yoga master attempted suicide - YOGA MASTER ATTEMPTED SUICIDE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Mar 29, 2024, 9:57 PM IST

Yoga master attempted suicide in Maduranagar : మధురానగర్ పోలీసులు తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ యోగా మాస్టర్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఇంటిలో తాళం వేసుకొని పెట్రోల్ బాటిల్​తో ఆత్మహత్య చేసుకోబోయాడు. ఇంటి విషయంలో తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు తెలియకుండా తన ఇంటిని కొనుగోలు చేశామంటున్న రౌడీలకు, పోలీసు అధికారి వత్తాసు పలుకుతున్నారంటూ వాపోయాడు. 

తన ఇంటిని కబ్జా చేయడానికి వచ్చిన రౌడీలపై ఫిర్యాదు చేస్తే న్యాయం చేయడంలేదని, పోలీసులు రౌడీలకు సహకరిస్తూ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నాడు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే అన్యాయం చేస్తున్నారంటూ వాపోయాడు. ఇక తనకు చావే గతి అంటూ పెట్రోల్ బాటిల్​తో ఆత్మాహత్యాయత్నానికి ప్రయత్నించాడు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్​గా మారింది. సమాచారం అందుకున్న మధురానగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.