వైసీపీ నేతల్ని భయపెడుతున్న ఎన్నికల కోడ్- పనులు పూర్తి కాకుండానే రిబ్బన్ కటింగ్ - YCP Leaders Started Kadapa RTC Depo

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 9, 2024, 10:12 PM IST

YCP Leaders Started Kadapa RTC Depot Before Completed: ఎన్నికల కోడ్ వస్తుందని ఉద్దేశంతో పనులు పూర్తికాకుండానే కడప ఆర్టీసీ డిపోను వైసీపీ నాయకులు ఆగమేఘాలపై ప్రారంభించారు. కేవలం ప్రహరీ, గదులు నిర్మాణాలు తప్ప మరి ఎలాంటి పనులు పూర్తికాలేదు. అయినప్పటికీ అట్టహాసంగా ఎంపీ అవినాష్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష, ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డిలు ప్రారంభించారు. 2022 డిసెంబర్​లో 10 కోట్ల రూపాయల వ్యయంతో ఐదు ఎకరాలలో కడప ఆర్టీసీ డిపోకు భూమి పూజ చేశారు. కానీ సకాలంలో గుత్తేదారులకు డబ్బులు చెల్లించకపోవడంతో వివిధ రకాల కారణాల చేత డిపో పనులు నత్తనడకన సాగాయి. కేవలం ప్రహరీగోడలు, రేకుల షెడ్డు గదులు నిర్మాణం తప్ప మరి ఎలాంటి పనులూ జరగలేదు. 

గ్యారేజీలో సిమెంట్ ఫ్లోరింగ్ గాని విద్యుత్తు సరఫరా, పెట్రోల్ బంకు, బస్సులు మరమ్మతు చేసే పిట్లు సైతం అసంపూర్తిగా ఉన్నాయి. పిట్లు కనబడకుండా చుట్టూ పరదాలు వేశారు. 9 నెలలలో ఆర్టీసీ డిపోను పూర్తి చేయాలని నిబంధన ఉంది కానీ డబ్బులు చెల్లించకపోవడంతో పనులు నత్తనడకన సాగాయి. పనులు పూర్తికాకమునుపే ప్రారంభోత్సవాలు ఎలా చేస్తారంటూ కార్మికులు చర్చించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.