AP High Court Comments on Illegal Constructions At Visakhapatnam Beach: విశాఖపట్నంలోని భీమునిపట్నం బీచ్ వద్ద అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. విశాఖ జిల్లా కలెక్టర్‌తో పాటు సీఆర్‌జెడ్ జోనల్ అధికారి, ఇతర అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. భీమునిపట్నం వద్ద చేపట్టిన నిర్మాణాలను కమిటీ పరిశీలించాలని, అవి అక్రమ నిర్మాణాలని తేలితే కూల్చివేయాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
తదుపరి విచారణ అయ్యేటప్పటికీ పూర్తి నివేదిక సమర్పించాలని కమిటీని న్యాయస్థానం ఆదేశించింది. నివేదికను సమర్పించడంలో విఫలమైతే అధికారులు కోర్టుకు హాజరుకావాలని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. భీమునిపట్నం బీచ్ వద్ద అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేయడం గమనార్హం.
శారదా పీఠానికి మరో షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
'ప్లాన్‌కు విరుద్ధంగా ఎలా నిర్మిస్తారు' - తిరుమల శారదాపీఠం భవనంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
రొయ్యల ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిపివేత - ద్వారంపూడి సోదరులకు హైకోర్టు షాక్