టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతల దాడి- ముగ్గురికి తీవ్రగాయాలు - YCP ATTACK on TDP ACTIVISTS - YCP ATTACK ON TDP ACTIVISTS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 11, 2024, 9:55 AM IST
YCP Leaders Attack on TDP Activists in Konapuram: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చినా వైసీపీ నేతల దాడులు ఆగట్లేదు. అధికారం ఉందనే అహంకారంతో ఆ పార్టీ నేతలు రోజురోజుకు రెచ్చిపోయి దాడులకు తెగబడుతున్నారు. తాజాగా టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన ఘటన సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కనగానపల్లె మండలం కోనాపురంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. తెలుగుదేశం కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు.
Three TDP Activsts Were Seriously Injured: వైసీపీ దాడిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు బండి రవి, బండి హరి తమపై దాడి చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతల దాడిలో గాయపడిన వారిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వైసీపీ నేతలు చేస్తున్న దాడులపై పలువురు టీడీపీ నేతలు మండిపడుతున్నారు.