శ్మశాన వాటికను ఆక్రమించిన వైఎస్సార్సీపీ నేత - చర్యలు తీసుకొని అధికారులు - శ్మశానంను ఆక్రమించిన వైసీపీ నేత
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 5, 2024, 1:21 PM IST
YCP Leader Occupying Cremation Ground in Eluru District : ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ నాయకుల ఆగడాలు పెచ్చుమీరుత్తున్నాయి. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం యర్రమళ్లలో గ్రామకంఠం భూమిని స్థానిక వైసీపీ నాయకుడు ఆక్రమించారు. నాచుగుంట పంచాయతీ పరిధిలో సర్వే నంబరు 359 లో గ్రామ కంఠం భూమి ఉంది. ఈ భూమిలో కొంత భాగాన్ని ఓ సామాజిక వర్గం కొన్నేళ్లుగా శ్శశాన వాటికగా వినియోగించుకుంటుంది.
ఈ శ్మశానంలో కొంత భూమిని, పక్కనే ఉన్న కోనేరు చెరువు గట్టును వైసీపీ నాయకుడు ఆక్రమించి స్తంభాలు పాతించి, కంచె వేయించాడు. ఈ విషయంపై అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన నాయకుడు కావడంతో అధికారులు నోరు మెదపలేకపోతున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి ప్రసాద్‌ను వివరణ కోరగా ఆక్రమణ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు రాగానే అక్రమణదారుడికి ఇస్తామన్నారు. శ్మశాన భూమిని అన్యక్రాంతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.