అడ్డతీగల పోలీస్‌స్టేషన్ ఎదుట ఉద్రిక్తత - టీడీపీ కార్యకర్తపై ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరుల దాడి - YCP Activsts Attack on TDP - YCP ACTIVSTS ATTACK ON TDP

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 10, 2024, 10:54 PM IST

YCP Leader Ananthababu Activists Attack on TDP Activist: పోలింగ్​ సమయం సమీపిస్తున్న తరుణంలో వైఎస్సార్​సీపీ కార్యకర్తలు టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎల్లవరంలో తెలుగుదేశం కార్యకర్త మిరియాల రాజుపై వైఎస్సార్​సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులు దాడి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అడ్డతీగల నుంచి ఎల్లవరం వెళ్తుండగా వర్షం కారణంగా కిందపడిపోయిన వైఎస్సార్​సీపీ ఫ్లెక్సీని తీసి పక్కన పెడుతున్న తెలుగుదేశం కార్యకర్తపై అనంతబాబు అనుచరులు దాడి చేసి గాయపరిచారు. 

అంతటితో ఆగకుండా పోలీసులకు ఫిర్యాదు చేసి అతన్ని స్టేషన్‌లో పెట్టించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు అడ్డతీగల పోలీస్‌ స్టేషన్ ఎదుట భైఠాయించి ఆందోళనకు దిగారు. దాడి చేసిన వైఎస్సార్​సీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అసలు జరిగిందేమిటో కూడా తెలుసుకోకుండా దాడికి పాల్పడటం చాలా దారుణమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడి కారణంగా ప్రస్తుతం అడ్డతీగల పోలీస్​ స్టేషన్​ ఎదుట ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.