మున్సిపల్ స్థలాల కబ్జా ప్రభుత్వానికి పట్టడం లేదా ?: వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు - Concerns of YCP councillors
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-01-2024/640-480-20625641-thumbnail-16x9-ycp-councillors-fire-on-chairperson-in-hindupur.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 6:52 PM IST
YCP Councillors Fire on Chairperson in Hindupur : హిందూపురం పురపాలక సంఘ పరిధిలో అభివృద్ధి పనులు జరగడం లేదంటూ అధికార పార్టీ కౌన్సిలర్లు చైర్ పర్సన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్ పర్సన్ ఇంద్రజను చుట్ట ముట్టి నిరసన వ్యక్తం చేశారు. దీంతో సమావేశంలో గందరగోళ వాతావరణం నెలకొంది. చైర్ పర్సన్ సమావేశాన్ని పది నిమిషాలు వాయిదా వేయడంతో వైసీపీ కౌన్సిలర్లు పోడియం ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. అలాగే ఎక్కడ చూసినా స్థలాలు యథేచ్ఛగా కబ్జాలకు గురౌతుంటే అధికారులకు, పాలక వర్గనికి పట్టడం లేదా అంటూ ప్రశ్నించారు.
వాయిదా అనంతరం సభ ప్రారంభమైనా ఆందోళన కొనసాగడంతో సభను మరోసారి వాయిదా వేస్తున్నట్లు చైర్ పర్సన్ ప్రకటించారు. దీంతో ఆగ్రహం చెందిన టీడీపీ కౌన్సిలర్లు, అధికార పార్టీ కౌన్సిలర్లే అవినీతి ఆరోపణలు చేస్తుంటే చర్చ కొనసాగించకుండా సభను వాయిదా వేయడం ఏంటని ప్రశ్నించారు. మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అవినీతి ఆరోపణలు, అభివృద్ధి పనులపైన చర్చ కొనసాగించాలని నినాదాలు చేశారు. లేనిపక్షంలో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.