ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు- నోటీసులు జారీ - YCP Campaign in guntur Mirchi Yard - YCP CAMPAIGN IN GUNTUR MIRCHI YARD
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 23, 2024, 3:43 PM IST
YCP Campaign in Guntur Mirchi Yard : గుంటూరులో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. వైసీపీ తరపున గుంటూరు పార్లమెంట్‌కు పోటీ చేస్తున్న కిలారి రోశయ్య, ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్, అలాగే గుంటూరు తూర్పు అభ్యర్థి నూరి ఫాతిమా మార్కెట్ యార్డులో ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత మిర్చియార్డులో ఎటువంటి సమావేశాలు నిర్వహించవద్దని, రాజకీయ పార్టీలు ప్రచారం చేయకూడదని, నాయకుల ఫొటోలు, ఫ్లెక్సీలు పెట్టకూడదని అధికారులు చెబుతూనే ఉన్నారు. అయినా వైసీపీ అభ్యర్థులు వీటిని ఖాతరు చేయకుండా మిర్చియార్డులో శుక్రవారం ప్రచారం నిర్వహించారు.
కమీషన్ ఏజెంట్లు, హామాలీలు, రైతుల్ని కలసి అభివాదం చేస్తూ ప్రచారం చేశారు. అనంతరం మిర్చి యార్డు ఆవరణలోనే ఉన్న గుంటూరు ఏఎంసీ వేమెన్ల ట్రేడ్ యూనియన్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. మిర్చియార్డులో ఉన్న వివిధ సంఘాల వారిని ఈ సమావేశానికి ఆహ్వానించి వచ్చే ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని కోరారు. వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావటంతో స్పందించిన మార్కెటింగ్‌శాఖ అధికారులు వేమెన్ల సంఘంతోపాటు సమావేశంలో భాగస్వామ్యులైన వారికి నోటీసులు జారీ చేశారు. మిర్చియార్డులో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించకూడదని, నిబంధనల్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.