అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు: యనమల రామకృష్ణుడు - Yanamala Rama Krishnudu comments - YANAMALA RAMA KRISHNUDU COMMENTS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 22, 2024, 7:45 PM IST
Yanamala Rama Krishnudu Comments: గత అయిదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో దారుణ విధానాన్ని అవలంబించిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కాకినాడ జిల్లా తునిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాన్ని అణచివేయాలని ఉద్దేశంతోనే ఏ అంశం గురించి కూడా ప్రతిపక్షం మాట్లాడకుండా వ్యవహరించడాన్ని ప్రజలు గమనించారన్నారు. గట్టిగా మాట్లాడితే ప్రతిపక్ష సభ్యులను ప్రతి రోజూ సస్పెండ్ చేసే వారన్నారు.
151 సీట్లు వచ్చాయి నా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తాను అనే విధంగా గతంలో వారి తీరు ఉండేదన్నారు. అందుకే ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. దాని ఫలితంగానే జగన్కు ప్రతిపక్ష హోదా లేకుండా పోయిందన్నారు. చట్టసభలలో చర్చలు లేకుండా చేశారని మండిపడ్డారు. చట్టసభలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, అవమానపరిచే విధంగా గత అయిదేళ్లలో పాలన జరిగిందని అన్నారు. అందుకే జగన్ మోహన్ రెడ్డి ఘోరంగా ఓటమి పాలయ్యారని పేర్కొన్నారు. ఇక ఇప్పుడు అసెంబ్లీకి కూడా జగన్ రాకుండా పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.