సికెల్ సెల్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం- అసలు ఈ సమస్య ఎందుకొస్తుందంటే? - World Sickle Cell Awareness Day - WORLD SICKLE CELL AWARENESS DAY

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 19, 2024, 2:08 PM IST

World Sickle Cell Awareness Day in Guntur : గిరిజన తెగలలో సంభవించే సికెల్ సెల్ వ్యాధిని నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే చెప్పారు. వరల్డ్ సికిల్ సెల్ డే సందర్భంగా మంగళగిరి ఎయిమ్స్​లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కాంతిలాల్ దండే హాజరయ్యారు. ఈ వ్యాధిపై రూపొందించిన పోస్టర్లను కాంతిలాల్ దండే ఆవిష్కరించారు. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్లకి ఈ వ్యాధి వస్తుందని దండే చెప్పారు. దీనిని నిరోధించేందుకు గిరిజనులకు స్క్రీనింగ్ టెస్ట్​లు ప్రారంభించామన్నారు. ఇప్పటికే మొదటి దశ పరీక్షలు పూర్తయ్యాయని దండే చెప్పారు. ఈ వ్యాధిగ్రస్థులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇస్తున్నామన్నారు. ఈ కార్డులు ఉన్నవాళ్లకి ఉచితంగా చికిత్సతో పాటు మందులు కూడా అందిస్తామన్నారు. దీనిపై పూర్తి అవగాహనతో మెలగాలని సూచించారు. ఈ వ్యాధి సాధారణంగా వారసత్వంగా వచ్చే హిమోగ్లోబిన్​  సంబంధిత రక్త రుగ్మతల సముహంగా పేర్కొంటారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి కోలుకోవచ్చని వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.