సాధారణ ప్రసవం - ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలు జననం - ముగ్గురు ఆడపిల్లలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 26, 2024, 7:11 PM IST
Women Gave Birth to Three Baby Girls in Normal Delivery : అనంతరం జిల్లా కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రిలో ఓ మహిళ సాధారణ ప్రసవంలో ముగ్గురు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి ఆర్డీటి ఆసుపత్రికి కాన్పు కోసం రాగా వైద్యులు ఆమెకు సిజేరియన్ లేకుండానే కాన్పు చేశారు. ఆ మహిళ ఆరోగ్యవంతమైన ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే లక్ష్మీదేవి, గణేష్ దంపతులకు నాలుగేళ్ల పాప ఉండగా రెండో కాన్పులో ముగ్గురు ఆడ పిల్లలకు జన్మించారు. ఈ వార్త తెలుసుకుని బంధువులు వారిని చూసేందుకు తరలి వస్తున్నారు.
Three Baby Girls in Normal Delivery : ఒకే కాన్పులో ముగ్గురు మహాలక్ష్ములు పుట్టారని బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు బిడ్డలు సాధారణ ప్రసవం ద్వారా పుట్టడం, వారంతా మంచి ఆరోగ్యం కలిగి ఉండటం పట్ల ఆస్పత్రి యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తున్నారు.