కుటుంబ కలహాలు - మద్యం మత్తులో ఉన్న భర్తని హత్య చేసిన మహిళ - విభేదాల కారణంగా భర్తను చంపిన భార్య
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 22, 2024, 8:28 PM IST
Wife Killed Husband In Satyasai District : సత్య సాయి జిల్లా ధర్మవరం మండలం సీతారాం పల్లి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు (Handloom worker) పలవెల్లి విశ్వనాథరెడ్డి భార్య ధనలక్ష్మి చేతిలో హత్యకు గురయ్యాడు. పదేళ్ల క్రితం ధర్మవరానికి చెందిన చేనేత కార్మికురాలు ధనలక్ష్మిని విశ్వనాథ్ రెడ్డి ప్రేమ వివాహం (love marriage) చేసుకున్నాడు. వీరికి నరేందర్, సతీష్, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ విషయంలో విభేదాలు తలెత్తాయి.
Wife Murdered Her Husband : బుధవారం రాత్రి విశ్వనాథరెడ్డి ధనలక్ష్మి గొడవపడ్డారు. మద్యం మత్తులో ఉన్న విశ్వనాథరెడ్డి మెడకు ధనలక్ష్మి తువ్వాలు బిగించి గోడకు కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ధర్మవరం గ్రామీణ పోలీసులు నింధితురాలు ధనలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. విశ్వనాథరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలతో విశ్వనాథరెడ్డిని భార్య ధనలక్ష్మి హత్య చేసిందని విచారణలో వెల్లడైనట్లు ధర్మవరం గ్రామీణ సీఐ ఆరోహణరావు తెలిపారు.