ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మధ్యమానేరుకు నీటి తరలింపు షురూ - Yellampalli Water Pumping - YELLAMPALLI WATER PUMPING
🎬 Watch Now: Feature Video
Published : Jul 27, 2024, 5:36 PM IST
Water Pumping From Yellampalli To Reservoirs : రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లుగానే మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌజ్ జోలికి వెళ్లకుండా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మధ్యమానేరుకు నీటిని తరలించే ప్రక్రియను ప్రారంభించింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద తరలి వస్తుండటంతో 20 టీఎంసీలకు గానూ ఇప్పటికే ప్రాజెక్టులో నీరు 17 టీఎంసీలకు చేరింది.
దీంతో మధ్యమానేరుకు నీటిని తరలించేందుకు నంది మేడారం పంప్ హౌస్‌లో రెండు మోటార్లను ప్రారంభించారు. 4, 6 మోటార్లు ప్రారంభించిన అధికారులు, 3,120 క్యూసెక్కుల నీటిని గాయత్రి పంప్ హౌస్‌కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి మధ్యమానేరుకు నీటిని తరలించనున్నారు. మొదట రెండు మోటార్లను ఆన్ చేసిన అధికారులు, సాయంత్రం వరకు మరో మూడు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశాలు ఉన్నాయి. కడెం జలాశయం నుంచి ఎల్లంపల్లికి నీటి ప్రవాహం నిలిచి పోగా 11వేల క్యూసెక్కులకు పైగా పరివాహక ప్రాంతం నుంచి వచ్చి ప్రవాహం ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతోంది.