'ఉద్యోగుల హక్కులను జగన్ కాలరాశారు- ప్రభుత్వం రెవెన్యూశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలి' - VROS ASSOCIATION - VROS ASSOCIATION
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 14, 2024, 11:01 AM IST
VRO's Association On NDA Government : కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం సంతోషంగా ఉందని ఏపీ వీఆర్వో ( AP VRO) అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రాజు రవీంద్ర రాజు అన్నారు. విజయవాడలో వీఆర్వో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. గత ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేసిందని రవీంద్రరాజు మండిపడ్డారు. ఉద్యోగుల హక్కులను జగన్ కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రెవెన్యూశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోరారు.
సమావేశంలో 13 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపతి రాజు రవీంద్ర రాజు మాట్లాడుతూ కూటమి విజయంలో ఉద్యోగులది కీలక పాత్ర అన్నారు. ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం, అన్ని సంఘాలను కలుపుకుని ముందుకు వెళ్తామన్నారు. రైతుల పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి బొమ్మలు తీసివేసి తిరిగి పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యలపై కొత్త ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.