తప్పుల తడకగా ఓటరు జాబితా - వైసీపీ సానుభూతిపరులకు డబుల్​ ఎంట్రీలు - Uravakonda Voter List Errors

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2024, 2:49 PM IST

Voter List Mistake in Anantapur District : ఎన్నికల అధికారులు సవరించిన ఓటర్ల జాబితాలో తవ్వేకొద్దీ తప్పులు వస్తూనే ఉన్నాయి. ఓటర్ల జాబితాను అధికారులు ఎంత లోపభూయిష్ఠంగా రూపొందించాారో అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే తేటతెల్లమవుతుంది. ఉరవకొండ పట్టణానికి చెందిన ఆర్​. మాబు గతంలోనే మృతి చెందారు. ఆయన మరణ ధ్రువీకరణ పత్రాన్ని కుటుంబ సభ్యులు బీఎల్వోకు ఇచ్చినా అతని పేరుతో ఓటు అలాగే ఉంది. కానీ బతికి ఉన్న అతని భార్య ఫాతిమా ఓటును అధికారులు తొలగించారు.

Uravakonda Voter List Errors : ఇంటింటా ఓటరు జాబితా పరిశీలన నామమాత్రంగా జరిగిందన్న విషయం తుది జాబితాను పరిశీలిస్తే సృష్టమవుతోంది. ఉరవకొండ పట్టణ కేంద్రంలో వరుస సంఖ్య 83, 282లో శ్రీనివాసులు, 283, 284లో సూర్యనారాయణ, 123, 130లో మంజులకు డబుల్​ ఓట్లు ఉన్నాయి. వరుస సంఖ్య 394 మృతి చెందిన వ్యక్తి పేరుతో ఓటు ఉంది. దీనిపై ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.