యువత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి- ఈటీవీ, ఈనాడు ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు - అనంతపురంలో ఓటు నమోదు కార్యక్రమం
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 31, 2024, 3:23 PM IST
|Updated : Jan 31, 2024, 3:41 PM IST
Vote Awareness Campaign Under Etv Eenadu in Anantapur: ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత యువతరంపై ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని 'ఈనాడు- ఈటీవి' ఆధ్వర్యంలో ఓటు నమోదు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతపురంలోని మాస్టర్ మైండ్స్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కళాశాల కరస్పాండెంట్ బసవరాజు, ప్రిన్సిపల్ రమేష్, విద్యార్థులు హాజరయ్యారు.
Vote Awareness Program In Master Minds Degree College: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు దేశ, రాష్ట్ర దిశా నిర్దేశాలను నిర్ణయిస్తుందన్నారు. డబ్బు కోసం ఓటు అమ్ముకోకుండా నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటు హక్కును ఉపయోగించాలని కోరారు. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు హక్కు నమోదుపై చేపట్టిన కార్యక్రమం అభినందనీయం అని కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారికి అవగాహన కల్పించారు. డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగవద్దని సూచించారు. గొడవలకు, అల్లర్లకు దూరంగా ఉండాలన్నారు.