బరితెగించిన వాలంటీర్లు- కోడ్ ఉల్లంఘించి వైఎస్సార్సీపీ ప్రచారంలో డ్యాన్స్‌లు - code VIOLATION
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 20, 2024, 10:03 PM IST
Volunteers Dancing in Election Campaign : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ మెుదలైనప్పటి నుంచి రాజకీయ ప్రచారంలో వాలంటీర్లు పాల్గొనకూడదని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను ఏ మాత్రం లెక్కచేయకుండా వాలంటీర్లు పేట్రేగిపోతున్నారు. అసలు ప్రచారమే చేయరాదు మహాప్రభో అంటే, వైసీపీ కండువా కప్పుకొని ఆ పార్టీ పాటలకు చిందులేస్తూ దర్శనమిచ్చాడు అనిల్ కుమార్ అనే ఓ వాలంటీర్. శ్రీ సత్యసాయి జిల్లా టీకుంట్లపల్లి పంచాయితీ పరిధిలోని చెర్లోపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికార పార్టీ నాయకుల అండతో ఈసీ ఆదేశాలను తుంగలో తొక్కి ప్రచారంలో మునిగిపోయాడు ఈ వాలంటీర్.
అదేవిధంగా జిల్లాలోని కొత్తచెరువు మండలంలోని బీసీ కాలనీలో జరిగిన వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఈరోజు అర్షద్ అనే మరో వాలంటీర్ పాల్గొన్నాడు. ఇతను సైతం వైసీపీ కండువా కప్పుకొని విజిల్లు వేస్తూ పాటలకు నృత్యాలు వేస్తున్నాడు. ఎన్నికల సంఘం ఆదేశాలను భేఖాతరు చేసి ఇలా పాల్గొనటం చూస్తుంటే వాలంటీర్లు ఎంతటికి బరితెగించారో అర్థం అవుతుంది. నిబంధనల ఉల్లంఘనలపై అక్కడక్కడ అధికారులు చర్యలు తీసుకుంటున్నా వెలుగులోకి రాని ఘటనలు అనేకం ఉన్నాయి.