ఏయూలో ఈవీఎంల భద్రతపై టీడీపీ ఆందోళన - వీసీ ప్రసాదరెడ్డిని తొలగించాలని ఆర్వోకి లేఖ - Sribharat Letter to RO
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 8, 2024, 9:54 PM IST
visakha Mp Candidate Sribharat Letter to Returning Officer : ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఈవీఎంల భద్రతపై విశాఖపట్నం తెలుగుదేశం ఎంపీ అభ్యర్ధి శ్రీభరత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏయూ వీసీ ప్రసాదరెడ్డి వైఎస్సార్సీపీకి పూర్తిగా అనుకూలమని దీనికి సంబంధించి గతంలో పలు ఘటనలు ఉన్నాయని చీఫ్ ఎన్నికల ఏజెంట్ ఆర్వోకి రాసిన లేఖలో వివరించారు. ప్రసాదరెడ్డి అధికారపార్టీ నేతలకు అనుకూలంగా ఆంధ్రా వర్సిటీని తయారు చేశారని వెల్లడించారు. దీంతో అక్కడి ఈవీఎంల భద్రతపై తాము ఆందోళన చెందే విధంగా ఉందన్నారు.
ఎన్నికల తరువాత ఈవీఎంలను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భద్రపరిస్తే వీసీ సహకారంతో వైసీపీ నాయకులు ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందన్నారు. కాబట్టి అలాంటి అవకాశాలకు చోటు ఇవ్వకుండా వైసీపీ నేతలకు వత్తాసు పలికే వీసీ ప్రసాద్ రెడ్డిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆ స్థానంలో నిష్పక్షపాతంగా వ్యవహరించే వీసీని నియమించాలని లేఖలో కోరారు. అలాగే ఏయూలో ఈవీఎంల భద్రతపై తమకు భరోసా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు చీఫ్ ఎన్నికల ఏజెంట్ ఆర్వోకి శ్రీభరత్ లేఖ రాసారు.