వైఎస్సార్​సీపీ నేత అదీప్‌రాజ్‌కు నిరసన సెగ - సమస్యలపై నిలదీసిన గ్రామస్థులు - Villagers deposed on issues - VILLAGERS DEPOSED ON ISSUES

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 10, 2024, 9:57 PM IST

Villagers Deposed YCP Leader Annamreddy Adeep Raj on Issues: ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌కు నిరసన సెగ ఎదురైంది. అనకాపల్లి జిల్లా పెందుర్తి మండలం చింతలగ్రాహంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా అదీప్‌రాజ్‌ ప్రచార వాహనాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామంలోని సమస్యలు ఐదేళ్లుగా పరిష్కారం కాలేదని అదీప్‌ రాజును స్థానికులు నిలదీశారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ఇప్పుడెలా ఓట్లు అడుగుతారని గ్రామస్థులు ప్రశ్నించారు. 

స్థానికుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి ఇలా అడిగితే రేపటి నుంచి గొడవలు తప్పవు అని గ్రామస్థులను అదీప్‌ రాజు హెచ్చరించటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓట్లు అడగడానికి వచ్చిన ఆయన స్థానికులనే బెదిరించి వెళ్లారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా అధికార పార్టీ నేతల్లో అహంకారం తగ్గలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సమస్యలను పరిష్కరించలేదని ప్రశ్నిస్తే ఇంత అహంకారమా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం మళ్లీ అధికారం ఇస్తే ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.