విజయవాడలో విరిగిపడ్డ కొండచరియలు - దుర్గగుడి ఘాట్ రోడ్ తాత్కాలికంగా మూసివేత - DURGA TEMPLE GHAT ROAD CLOSED - DURGA TEMPLE GHAT ROAD CLOSED
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 31, 2024, 4:36 PM IST
Vijayawada Durga Temple Ghat Road Closed Temporarily: విజయవాడలో భారీ వర్షం కారణంగా దుర్గ గుడి ఘాట్ రోడ్డు, ఫ్లైఓవర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఆలయానికి వెళ్లే రహదారిలో పైనుంచి కొండచరియలు పడుతుండటంతో ఆలయ అధికారులు ముందస్తు జాగ్రత్త కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్రిడ్జి దగ్గర వర్షపు నీరు నిలిచిపోవడంతో మూడు బస్సులు, ఒక లారీ అందులో చిక్కుకున్నాయి. ఘాట్ రోడ్డు సమీపంలో కూలిన చెట్లను వీఎంసీ (Vijayawada Municipal Corporation) సిబ్బంది తొలగిస్తున్నారు.
ఎడతెరిపిలేని వర్షంతో పలు చోట్ల రహదారులు చెరువులను సైతం తలపిస్తున్నాయి. విజయవాడలోని విద్యాధరపురం, ఆర్‌ఆర్ నగర్‌లో రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరింది. విజయవాడ బస్టాండ్ పరిసర ప్రాంతాలు సైతం నీట మునిగాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.