Home Minister Helps Student in Palnadu District : సోదరుడితో ద్విచక్రవాహనంపై కళాశాలకు వెళుతూ ప్రమాదవశాత్తు మూర్ఛ వచ్చి కిందపడిన యువతికి హోంమంత్రి అనిత సపర్యలు చేసి మానవత్వం చాటుకున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట వై జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది. హోంమంత్రి అనిత గుంటూరు - కర్నూలు రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం వెళ్తున్నారు. అదే సమయంలో శావల్యపురం మండలం కారుమంచికి చెందిన లలిత అనే బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తన సోదరుడితో ద్విచక్రవాహనంపై అటుగా వెళుతున్నారు.
స్థానికుల ప్రశంసలు : నరసరావుపేటలోని MAM కళాశాలకు వెళుతూ వై జంక్షన్ వద్ద మూర్ఛ వచ్చి ద్విచక్రవాహనంపై నుంచి కింద పడ్డారు. ప్రమాదాన్ని చూసి వెంటనే హోంమంత్రి అనిత కాన్వాయ్ ని ఆపి బాధితుల దగ్గరకు వెళ్లి గాయపడిన యువతికి స్వయంగా సపర్యలు చేశారు. హుటాహుటిన వేరే వాహనంలో ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. హోంమంత్రి అనిత స్పందించిన తీరుపై స్థానికులు ప్రశంసలు కురిపించారు.
లోయలో పడ్డ బస్సు- ఐదుగురు మృతి- 17మందికి తీవ్రగాయాలు
వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా - నలుగురు మహిళలు మృతి