దాచుకున్న డబ్బుల్ని దోచుకున్న ప్రభుత్వం - ₹19వేల కోట్ల బకాయిపై ఉపాధ్యాయుల ఆగ్రహం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 31, 2024, 1:47 PM IST
UTF Protest Against YSRCP Govt in Vizianagaram : తమకు రావలసిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని విజయనగరం కలెక్టరేట్ వద్ద యూటీఎఫ్ (ఐక్య ఉపాధ్యాయుల ఫెడరేషన్) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరాహారదీక్షకు దిగారు. డీఏ, పీఆర్సీ ఎరియర్లు, పీఎఫ్, ఏపీజీఎల్ఐ లోన్లు, సరెండర్ లీవ్‌లు అన్నీ కలిపి 20 వేల కోట్లు ప్రభుత్వం బకాయి ఉందన్నారు. గత నెలలో యూటీఎఫ్ పోరాటం చేస్తే కేవలం రూ.వెయ్యి కోట్లే విడుదల చేశారని, ఇంకా రూ.19వేల కోట్లు బకాయి ఎప్పుడు తీరుస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తాము దాచుకున్న డబ్బుల్ని ఇవ్వమంటున్నామని, మేము జీతాలు పెంచమనడం లేదని గుర్తుచేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఎందుకు మాపై మొండిగా వ్యవహరిస్తోందో తెలియడం లేదని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం దాచుకున్న డబ్బుల్ని కూడా దోచుకునే విధంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఎన్నికల ముందైనా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా బుధవారం నుంచి నాలుగు రోజులపాటు దీక్షలు కొనసాగుతాయన్నారు.