యురేనియం ప్లాంట్ పైప్‌లైన్ లీకేజీ - పొలాల్లోకి వ్యర్థ జలాలు - Uranium Plant Pipeline Leakage
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-02-2024/640-480-20770328-thumbnail-16x9-uranium-pipeline-leak.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 16, 2024, 10:33 PM IST
Uranium Plant Pipeline Leakage in YSR District: వైఎస్సార్ జిల్లాలోని తుమ్మలపల్లి యురేనియం కర్మాగారం నుంచి టైల్‌పాండుకు వచ్చే పైపు లైను లీకైంది. ముడి యురేనియం శుద్ధి చేసి వ్యర్థ జలాలను ఐదు కిలోమీటర్ల దూరంలోని టైల్ పాండుకు సరఫరా చేసే క్రమంలో లీకైంది. దీంతో యురేనియం కలుషిత నీరు పొలాల్లోకి ప్రవహించింది. ఉదయం విషయం తెలుసుకున్న అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి లీకేజీని అరికట్టారు. విషయం పెద్దది కాకుండా ఉండేందుకు అధికారులు యంత్రాల సహాయంతో కలుషిత నీరు ప్రవహించిన పొలాలోని మట్టి అంతటిని తొలగించి చదును చేస్తున్నారు.
లీకేజీకి సంబంధించి ఫొటోలు, వీడియోలు తీసిన కొందరు స్ధానికులను సిబ్బంది బెదిరించినట్లు సమాచారం. యురేనియం వ్యర్థ జలాలు పంట పొలాల్లోకి ప్రవహించడంతో భూగర్భ జలాలు కలుషితం అవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వ్యర్థ జలాలు పొలాల్లోకి ప్రవహించాయని ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి యురేనియం వ్యర్థ జలాలు భూగర్భంలోకి ఇంకి నీళ్లు కలుషితం మవుతున్నాయని రైతులు చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తాజాగా బహిరంగంగానే వ్యర్ధ జలాలు పొలాల్లోకి ప్రవహించడం వల్ల అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.