పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కు సన్నద్ధం - 568 ర్యాంకుతో మెరిసిన వరంగల్ వాసి - UPSC 568th Ranker Kiran Interview - UPSC 568TH RANKER KIRAN INTERVIEW
🎬 Watch Now: Feature Video
Published : Apr 21, 2024, 8:06 PM IST
UPSC 568th Ranker Kiran Interview : పట్టుదలకు ప్రణాళిక తోడైతే విజయం తథ్యమని నిరూపించాడా యువకుడు. లక్ష్యాన్ని చేరడం కోసం 5 సార్లు ప్రయత్నించి ఓడిపోయినా, పట్టు వదలని విక్రమార్కడిలా ప్రయత్నిస్తూ వచ్చాడు. ఫలితంగా ఇటీవల వెలువడిన యూపీఎస్సీ ఫలితాల్లో 568వ ర్యాంకు సాధించాడు. అతడే వరంగల్ జిల్లా గీసుకొండ మండలం అనంతారంకు చెందిన సయింపు కిరణ్. తన విజయం వెనుకాల తన మిత్రబృందంతో పాటు కుటుంబం ప్రోత్సాహం ఎంతో ఉందని చెబుతున్నారు.
Kiran Preparation for UPSC Civils : సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూనే మరోవైపు యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఆన్‌లైన్‌లో ట్యూషన్లు చెప్పి సొంత ఖర్చులు వెళ్లదీసుకున్నట్లు వెల్లడించారు. ఒకవైపు సన్నద్ధత, మరో వైపు బోధన యూపీఎస్సీ ర్యాంకు సాధించడంలో అనుకూలించాయంటున్నారు. తన ఆన్‌లైన్ క్లాసులకు అటెండ్ అయిన పలువురు ఉన్నత ఉద్యోగాలకు ఎంపికయినట్లు తెలిపారు. ఏదేమైనా ఓటమికి కుంగిపోకుండా రెట్టించిన పట్టుదలతో శ్రమిస్తే విజయం సాధ్యమే అంటున్న ఆ యూపీఎస్సీ ర్యాంకర్‌తో ప్రత్యేక ముఖాముఖి.