రాష్ట్రంలో అకాల వర్షాలు - విద్యుత్ అంతరాయంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు - Current Stopped - CURRENT STOPPED
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 8, 2024, 1:36 PM IST
Unseasonal Rains Current Stopped People Suffer : రాష్ట్రంలో అకాల వర్షం కారణంగా భానుడి భగభగల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగింది. భారీ ఈదురు గాలులు కారణంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఉక్కపోతతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. బాపట్ల జిల్లా మంగళవారం ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన చిరు జల్లులు కురిశాయి. ఈ నేపథ్యంలోనే చీరాలలో విద్యుత్ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Chirala Bapatla District : మంగళవారం రాత్రి చీరాల పట్టణంలో కొద్దిపాటి గాలులు వీయడంతో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దాదాపు రాత్రి 11 గంటలకు నిలిచిపోయిన విద్యుత్ తెల్లవారుజామున 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు రాత్రంతా దోమలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. విద్యుత్ అంతరాయంపై అధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం సమాచారం ఇవ్వకుండా విద్యుత్ నిలిపివేశారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.