రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పెద్దపీట- 'విశాఖ ఉక్కు'ను కాపాడుకుంటాం : కేంద్రమంత్రి భూపతిరాజు - Union Minister Bhupathiraju - UNION MINISTER BHUPATHIRAJU
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-08-2024/640-480-22123065-thumbnail-16x9-union-minister-bhupathi-srinivasa-varma-visit-tirumala.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 4, 2024, 9:49 AM IST
Union Minister Bhupathi Srinivasa Varma Visit Tirumala : రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతిలోని అలిపిరికి చేరుకున్న ఆయనకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ బడ్జెట్లో కేంద్రం రాష్ట్రానికి పెద్ద పీట వేసిందని తెలిపారు.
అమరావతి, పోలవరం విషయంలో, ఇతర పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిగిందని భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా కాపాడుతామని, విశాఖ ఉక్కును లాభాల బాటలో నడిపించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కేంద్రం ఇచ్చిందని, రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని వెల్లడించారు. ప్రత్యేక హోదాకు మించిన అదనపు ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్‌కు చేకూరుతున్నాయని, ఎన్డీఏ పాలనలో ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఆయన భరోసా ఇచ్చారు.