మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్ మొదటి సంతకం - నిరుద్యోగ సంఘాల హర్షం - JAC Unions Thankful to Lokesh - JAC UNIONS THANKFUL TO LOKESH
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 24, 2024, 2:06 PM IST
Unemployed JAC Unions Thankful to IT Minister Lokesh: మెగా డీఎస్సీకి మంత్రివర్గ ఆమోదం తెలపటంతో అమరావతి సచివాలయంలో విద్యార్థి, యువజన, నిరుద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. గతంలో మంత్రులు ఎవ్వరూ తమని సచివాలయంలోకి అనుమతించకపోగా వినతులు కూడా తీసుకునే పరిస్థితి లేదని నిరుద్యోగ యువత విమర్శించారు. నారా లోకేశ్ మంత్రిగా బాధ్యతలు తీసుకుంటూ విద్యార్థి, యువజన, నిరుద్యోగ సంఘాల సమక్షంలోనే డీఎస్సీ విధి విధానాలపై తన మొదటి సంతకం పెట్టారంటూ హర్షం వ్యక్తం చేశారు.
యువత సమస్యలు తెలిసిన వ్యక్తి నాయకుడిగా రావటం పట్ల నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ప్రతీ సమస్య పరిష్కారానికి లోకేశ్ హామీ ఇచ్చారంటూ కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తరుణంలో చేసిన 5 సంతకాలకు మంత్రివర్గ ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీకి మంత్రివర్గ ఆమోదం తెలపడంతో నిరుద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.