ఏ పదవి ఇవ్వకపోయినా నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తా : రఘురామ కృష్ణరాజు - RRR visited tirumala - RRR VISITED TIRUMALA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 14, 2024, 7:17 PM IST
Undi MLA Raghu Rama Krishnam Raju Press Meet : నాలుగున్నర సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం కూటమి ఘన విజయం సాధించిందని ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుపతి చేరుకున్న ఆయన నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నామినేషన్ వేసినప్పుడు విజయం సాధించిన తరువాత స్వామి వారి దర్శనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగి ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఉపాధి పొందాలని కోరుకున్నట్లు వెల్లడించారు.
ఎమెల్సీ వ్వవస్థను రద్దు చేయాలని భావించిన వ్యక్తి ఇప్పుడు వాళ్లతో ఎందుకు సమావేశమయ్యారని జగన్‌పై విమర్శలు గుప్పించారు. రాజ్యసభలో బీజేపీ మద్దతు కోసం వైఎస్సార్సీపీని అడిగినా అడగకపోయినా వీళ్ల అవసరం కొద్ది మద్దతిస్తారన్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఎన్డీయేకి అన్నివిధాలుగా మద్దతిస్తామని విజయసాయి రెడ్డి చెప్పినట్లు గుర్తుచేశారు. అంగన్ వాడీల సమస్యలను పరిగణనలోకి తీసుకొని తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఏ పదవి ఇవ్వకపోయినా తన బాధ్యతను నిర్వర్తిస్తానని రఘురామ కృష్ణరాజు తెలిపారు.