LIVE : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమం - ప్రత్యక్షప్రసారం - Rangam Program 2024 Live - RANGAM PROGRAM 2024 LIVE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 22, 2024, 9:03 AM IST
|Updated : Jul 22, 2024, 10:08 AM IST
Rangam Program Secunderabad Ujjaini Mahankali Live : లష్కర్ బోనాలతో ఆదివారం నాడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం సందడిగా మారింది. తెల్లవారుజామునుంచే తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మక వాతావరణం వెల్లివిరుసింది. తెల్లవారుజామునే హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కుటుంబ సమేతంగా అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. తెల్లవారుజామున అమ్మవారికి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు. సాకలు సమర్పించి విశేష నివేదన చేశారు. మహంకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ఏర్పాట్లను పర్యవేక్షించారు. రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని ఆకాంక్షించినట్లు మంత్రి పొన్నం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహంకాళి బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి వైభవంగా నిర్వహిస్తుందన్నారు. అమ్మవారి బోనాన్ని అలంకరించి అంగరంగ వైభవంగా ఉత్సవాలను ప్రారంభించినట్లు తెలిపారు.అందులో భాగంగా నేడు తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించానని వెల్లడించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే ఇక్కడ బోనం సమర్పించడానికి అక్కాచెల్లెళ్లు అందరూ వస్తారని పేర్కొన్నారు. నేడు రంగం పేరుతో అమ్మవారు స్వరూపంగా భావించే మహిళ చెప్పే భవిష్యవాణి ఈ రెండు రోజుల జాతరలో కీలకం. భవిష్యవాణిలో ఈ ఏడాది వర్షాలు ఎలా కురుస్తాయో, ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటే ఏమి చెయ్యాలో ఇవన్నీ చెబుతారు. ఇందుకోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Last Updated : Jul 22, 2024, 10:08 AM IST