తప్పతాగి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు- ఆస్పత్రికి తరలిస్తే రచ్చ చేశారు - Alcohol intoxication - ALCOHOL INTOXICATION
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 21, 2024, 12:31 PM IST
Two Younsters Halchal in Hospital: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల సామాజిక ఆస్పత్రిలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. రణస్థలానికి చెందిన కె.నవీన్, జగన్ బైక్‌పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో ఆస్పత్రికి వెళ్లారు. అప్పటికే మద్యం సేవించి ఉన్న యువకులు ఆస్పపత్రి సిబ్బందిపై దుర్భాషలాడుతూ వారిపై దాడి చేశారు. అక్కడి రికార్డులను చిందరవందరగా విసిరేస్తూ హంగామా చేశారు. ఈ దాడిలో సెక్యూరిటీ గార్డుకు గాయాలయ్యాయి.
అక్కడ ఉన్న స్థానికులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించినా దుర్భాషలాడుతూ నానా హంగామా చేశారు. వారిని నుంచి తప్పించుకోవడానికి సెక్యూరిటీ గార్డు గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటే బలవంతంగా దానిని కాలితో తన్నుతూ అక్కడ ఉన్న రికార్డులను సైతం ధ్వంసం చేశారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు ఆస్పత్రి సిబ్బందిపై దాడి చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.